బాలీవుడ్ పరువును నిలబెట్టిన యంగ్ హీరో ?

by సూర్య | Sat, May 21, 2022, 12:12 PM

ప్రస్తుత కాలంలో నార్త్ లో సౌత్ సినిమాల హవా అందిస్తుంది. సౌత్ సినిమాలు నార్త్ లో వందల కోట్లు వసూలు చేస్తుంటే, హిందీ  సినిమాలు కనీసం నార్త్ లో బ్రేక్ ఈవెన్ సాధించలేక ఉసూరుమంటున్నాయి. ఈ సంవత్సరంలో  హిందీలో విడుదలైన గంగూభాయ్ కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు తప్పితే మిగిలిన ఏ సినిమాలు కూడా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. వీటిల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండటం విశేషం. అక్షయ్ బచ్చన్ పాండే, టైగర్ ష్రాఫ్ హీరో పంటి, షాహిద్ కపూర్ జెర్సీ, రణ్ వీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక చతికిలపడ్డాయి. 


కట్ చేస్తే, హిందీలో తాజాగా విడుదలైన భూల్ భులాయియా2 చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో బాలీవుడ్ పరువును నిలబెట్టే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ యువనటుడు కార్తీక్ ఆర్యన్, గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం 2007లో అక్షయ్ కుమార్ నటించిన భూల్ భులాయియా కి సీక్వెల్ గా తెరకెక్కింది. హార్రర్ కమ్ కామెడీ జోనర్ లో నడిచే ఈ చిత్రానికి బాలీవుడ్ జనాలు బాగానే కనెక్ట్ అయినట్టున్నారు. అందుకే ఈ చిత్రానికి తొలిరోజు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. అనీష్ బజ్మీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లు  రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తొలి రోజు వసూళ్లకు దగ్గరగా వచ్చాయని కొన్ని కథనాలు బాలీవుడ్ మీడియాలో వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉత్తరాది మల్టీప్లెక్స్ ల నుండి రూ. 8.25 కోట్లు కలెక్ట్ చెయ్యగా, భూల్ భులాయియా రూ. 7.5 కోట్లు కలెక్ట్ చేసింది. నిజానికి ఆర్ ఆర్ ఆర్ మూవీకి టికెట్ రేట్లను పెంచారు. కానీ, భూల్ భులాయియా చిత్రం సాధారణ టికెట్ రేట్లతోనే థియేటర్లలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం పట్ల హిందీ జనాలు చూపిస్తున్న ఆసక్తికి, అదరణకి బాలీవుడ్ కొంచెం రిలీఫ్ అయ్యినట్టు కనిపిస్తుంది. అయితే, లాంగ్ రన్ లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది? ఇంటరెస్టింగ్ గా ఉంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM