"ఊహలు గుసగుసలాడే" మూవీ నుంచి 'ఏం సందేహం లేదు' పాట లిరిక్స్

by సూర్య | Sat, May 21, 2022, 11:31 AM

"ఊహలు గుసగుసలాడే" మూవీ నుంచి 'ఏం సందేహం లేదు' పాట లిరిక్స్:
ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు… ఆ గంధాల గొంతె
ఆనందాలు పెంచింది

నిమిషము నేల మీద… నిలువని కాలి లాగ
మది నిను చేరుతోందే చిలకా..!
తనకొక తోడు లాగ… వెనకనే సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖ

ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా… వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి… నీ కళ్ళాపి చల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే

నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ
మది నిన్ను చేరుతుంది చిలకా..!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖ

వెన్నెల్లో ఉన్నా… వెచ్చగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే

ఈ కొమ్మల్లో గువ్వ… ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటోంది విన్నావా
ఈ మబ్బుల్లో జల్లు… ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నా గాని… ఏమైనా అయిపోనీ
ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వేయలేక… అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక… బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖ

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM