పవర్ స్టార్ అభిమానులకు హరీష్ శంకర్ ప్రామిస్

by సూర్య | Sat, May 21, 2022, 11:29 AM

హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీలో పవన్ కళ్యాణ్‌ సరసన సిజ్లింగ్ బ్యూటీ  పూజాహెగ్డే జంటగా నటించనుంది. ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఈ సినిమా గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ.... భవదీయుడు భగత్‌ సింగ్‌' చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో పవన్ చెప్పే డైలాగులు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటాయి. భ‌వాదీయుడు భ‌గ‌త్ సింగ్ ఈ ఆగ‌స్టులో సెట్స్‌పైకి వ‌స్తుంద‌ని హ‌రీష్ అన్నారు. మాస్ అండ్ సోషల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. పవర్ స్టార్ అభిమానులు పవన్ అండ్ హరీష్ కాంబో లో రానున్న సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పవర్ ఫుల్ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM