ఎన్టీఆర్ 31 కోసం విశ్వనటుడిని రంగంలోకి దింపిన ప్రశాంత్ నీల్?

by సూర్య | Sat, May 21, 2022, 11:28 AM

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతుందని గత కొన్నిరోజులుగా టాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ వార్తని అధికారికంగా నిజం చేస్తూ, నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. గూజ్ బంప్స్ తెప్పించేవిధంగా ఉన్న తారక్ లుక్ కు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. అలా... ఎనౌన్స్ చేసారో లేదో.. ఈ సినిమా పై పలురకాల రూమర్స్ టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటుంది. ఈ న్యూస్ విన్న వాళ్ళకి నిజంగా ఇది నిజమైతే ఎంత బావుణ్ణు ! అని ఖచ్చితంగా అనుకుంటారు. అదేంటంటే ... ఎన్టీఆర్ 31 లో తారక్ కు ధీటుగా నటించే పాత్రలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించబోతున్నారట. ఈ విషయమై ఇప్పటికే కమల్ ను అప్రోచ్ ఐన ప్రశాంత్ నీల్, ఆయనకు కథ వినిపించటం, కమల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అన్నీ చకాచకా జరిగిపోయాయని టాక్. ప్రకాష్ రాజ్, మోహన్ లాల్ వంటి విభిన్న నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న తారక్ వారితో కలిసి ఎంత పోటాపోటీగా నటించాడో మనందరికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు దేశం...  కాదు ప్రపంచం మెచ్చిన నటుడితో తారక్ నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 31 లో కమల్ హాసన్ నటించే విషయంపై చిత్రబృందం పెదవి విప్పట్లేదు. ఆయన పాత్రతో ఈ సినిమాపై హైప్స్ తీసుకురావాలని, మంచి సందర్భం చూసుకున్న తర్వాతనే కమల్ హాసన్ పాత్రను ఎనౌన్స్ చెయ్యాలని చిత్రబృందం భీష్మించుకుని కూర్చుందట. సో.... అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వెయిట్ అండ్ సీ....

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM