ఇండియన్ క్రికెటర్ ఇకపై సినిమాలలోకి....!

by సూర్య | Tue, May 17, 2022, 09:20 PM

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ క్రీజులో ఎంత వైల్డ్ గా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. ప్రత్యర్థుల పట్ల ఒక సింహంలా విరుచుకు పడే శిఖర్ త్వరలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పొడుగాటి మీసాలతో మంచి మాస్ హీరోగా కనిపించే ఈ ఎడమచేతి బ్యాట్స్ మెన్ త్వరలోనే ఒక బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న రామసేతు సెట్స్ లో శిఖర్ ఒకసారి మెరవడంతో ఈ వార్తలకు మరింత ఊతమందింది. అక్షయ్, శిఖర్ ఫ్రెండ్స్ కావడం వలన ఆ మూవీ సెట్స్ లో శిఖర్ కనిపించారు, అంతేకానీ ఆ మూవీలో శిఖర్ నటించట్లేదని కొంతమంది అంటున్నారు. మరో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో శిఖర్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలా రోజుల తర్వాత కలవడం ఆనందంగా ఉంది.. అంటూ కామెంట్ చేసాడు. సో.., ఇప్పుడు అందరి దృష్టి రణ్ వీర్ సినిమాలపై పడింది. అతను హీరోగా చేస్తున్న సినిమాలలో శిఖర్ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందంటూ మరికొన్ని వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలో కూడా ఎలాంటి నిజం లేదని మరికొంతమంది తేల్చి చెప్తున్నారు. రణ్ వీర్, శిఖర్ కూడా మంచి స్నేహితులు కావడంతో ఆయన ఫోటోను శిఖర్ పోస్ట్ చేసాడంతే కానీ, రణ్ వీర్ సినిమాలో శిఖర్ నటించట్లేదు అని అంటున్నారు. మరి నిజానికి శిఖర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడా? లేదా? అనే విషయంపై చాలా తికమక నెలకొంది. శిఖర్ తన బాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించి ఏదో ఒక విషయాన్నీ త్వరలోనైనా అధికారికంగా ప్రకటిస్తే కానీ ఈ రూమర్లకు చెక్ పడేటట్టు లేదు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM