అగ్రహీరో మోహన్‌లాల్‌కు ఈడీ షాక్

by సూర్య | Sat, May 14, 2022, 05:02 PM

సినీ హీరో మోహన్‌లాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ పురాతన వస్తువుల డీలర్‌గా నటిస్తూ మోసగాడు మోన్సన్ మావుంకల్‌పై సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలతో మోహన్‌లాల్‌ను విచారించనుంది. కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని మోహన్‌లాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు పంపింది. వచ్చే వారం కొచ్చి ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో కోరారు. మోహన్‌లాల్ కలూర్‌లోని మోన్సన్ మావుంకల్ ఇంటికి వెళ్లినట్లు ఈడీకి వాంగ్మూలం అందింది. మోన్సన్‌తో సన్నిహిత సంబంధం ఉండడంతో పాటు మనీలాండరింగ్‌లో మోహన్‌లాల్‌‌ పాత్ర ఏమైనా ఉందా అని ఈడీ విచారించనుంది.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM