రెండు రోజుల్లోనే సర్కారోడి వంద కోట్ల పాట

by సూర్య | Sat, May 14, 2022, 07:18 PM

మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారువారిపాట తో కెరీర్లోనే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టాడు. పరశురామ్ డైరెక్షన్లో, మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సర్కారువారిపాట పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. మే 12న విడుదలైన ఈ చిత్రం తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 75కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా రెండో రోజు కలెక్షన్లను కలుపుకుని మొత్తం రూ. 103కోట్లను వసూలు చేసింది. దీంతో సర్కారువారిపాట రెండురోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


మొదటి రోజుకన్నా రెండో రోజు అంటే శుక్రవారం ఈ సినిమా వసూళ్లు బాగా పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఉదయం ప్రదర్శనల కన్నా, సాయంత్రం, రాత్రి పూట షోలకు మంచి డిమాండ్ ఏర్పడిందట. మూడో రోజు కూడా బుక్ మై షో లో టికెట్ల బుకింగ్స్ ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. రేపు ఆదివారం కాబట్టి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓవర్సీస్ లో రెండు రోజుల్లోనే 1.5మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసి, మహేష్ ను ఓవర్సీస్ స్టార్ గా చేసింది ఈ సినిమా. త్వరలోనే ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ తో పోస్ట్ రిలీజ్ ప్రొమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM