రౌడీ హీరోపై బాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రశంసలు

by సూర్య | Sat, May 14, 2022, 04:08 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం లైగర్.  పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, హీరోయిన్ ఛార్మి కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ అనన్యా పాండే ఇందులో హీరోయిన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్యా విజయ్ దేవరకొండపై షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ ది జాలి హృదయమని, ఆయన ఎవరితోనైనా యిట్టే కలిసిపోతారని, అమెరికాలో షూటింగ్ రోజులు ఎంతో సరదాగా గడిచాయని అనన్యా తెలిపింది. లైగర్ సినిమా అందరికీ నచ్చే మంచి మాస్ మసాలా మూవీ అని పేర్కొంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న, పాన్ ఇండియా భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటే, ఇటీవల విడుదలైన లైగర్ థీమ్ వీడియోతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM