కుటుంబంతో మరోసారి వెకేషన్ ప్లాన్ చేసిన మహేష్ బాబు

by సూర్య | Sat, May 14, 2022, 03:49 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో పక్కా ఫ్యామిలీ మ్యాన్ ఎవరంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాల నుండి కాస్తంత తీరిక సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే మహేష్ ఇష్టపడతాడన్న విషయం అందరికి తెలిసిందే. తన తోటి నటీనటులు వరసగా రెండు మూడు ప్రాజెక్టుల్లో నటిస్తూ హర్రీ బర్రీ గా ఉంటుంటే, మహేష్ మాత్రం నిదానమే ప్రధానము అంటూ ఒక సినిమా పూర్తయిన తర్వాతనే మరో సినిమా స్టార్ట్ చేస్తాడు. సినిమా సినిమాకి మధ్యలో దొరికే విరామంలో కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంటాడు. కొన్ని సంవత్సరాల నుండి మహేష్ పాటిస్తున్న సెంటిమెంట్ ఇది. 


సర్కారువారిపాట సినిమా అలా పూర్తయ్యిందో లేదో ఇలా సూపర్ స్టార్ ప్యారిస్ వెకేషన్ కి చెక్కేసాడు. రిఫ్రెష్ ఐన తర్వాత  SVP ప్రమోషన్స్  ను ఒక రేంజులో ఊదరగొట్టేసాడు. మే 12 న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లలో బాగానే రన్ అవుతుంది. ఈ వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా మరోసారి కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లాలని మహేష్ ప్లాన్  చేస్తున్నాడట. వచ్చే వారంలో యూఎస్ఏ వెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నారట. మళ్ళీ ఈ నెలాఖరుకి ఇండియాకు  తిరిగొచ్చే మహేష్ బాబు జూన్ 28నుండి త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM