మే 20న ఆచార్యుడి డిజిటల్ స్ట్రీమింగ్ ఖచితమే, ప్రకటించిన ప్రైమ్ వీడియో

by సూర్య | Sat, May 14, 2022, 03:47 PM

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తొలి సారి తెరపై ఎక్కువసేపు కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న,  చిరంజీవి 153 వ సినిమాగా విడుదలైన ఆచార్య తొలి షో నుండే నిగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి పురోగతిని సాధించలేకపోయింది.  బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లతోనే అట్టట్టా నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య ఓటీటి స్ట్రీమింగ్ పై అంతటా ఆసక్తి నెలకొంది. అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటిలో స్ట్రీమింగ్ కానుందని చాలా వార్తలే వినిపించాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. మే 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఆచార్య స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఈ సినిమా విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటిలోకి రావలసి ఉంది. కానీ, ఆచార్య ధియేటర్ టాక్, వస్తున్న కలెక్షన్ల దృష్ట్యా అనుకున్న సమయానికన్నా 30 రోజుల ముందే డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆచార్య నిర్మాతలను కోరిందట. ఇందుకోసం ఆచార్య నిర్మాతలకు ఆ ఓటీటి సంస్థ 15-20కోట్లు ముట్టజెపుతుందని టాక్. ఆచార్య నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. మరి నిర్మాతలు ఆ మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే, అమెరికాలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఇండియా కి తిరిగి రావాలి.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM