'విక్రమ్' ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధం

by సూర్య | Sat, May 14, 2022, 02:05 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని 'పాతాల పాతాల' అనే టైటిల్ తో మొదటి పాటను విడుదల చేసారు. మే 15, 2022న ఆడియో అండ్ ట్రైలర్‌ను స్టైల్‌గా లాంచ్ చేయనున్నారు అని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ముందుగా ఆడియోను దుబాయ్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ లాస్ట్ కి చెన్నైలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. మే 15న సాయంత్రం 6 గంటల నుంచి జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM