OTT విడుదల తేదీని లాక్ చేసిన 'భళా తందననా'

by సూర్య | Sat, May 14, 2022, 01:59 PM

చైతన్య దంతులూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'భళా తందననా' సినిమా మే 6, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తుంది. కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. సత్య, శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకోగా, స్టార్ మా శాటిలైట్ రైట్స్ ని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఈ సినిమాని మే 20, 2022న OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM