కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరవనున్న తెలుగు భామలు

by సూర్య | Sat, May 14, 2022, 12:44 PM

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల ఉత్తమ సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు గ్లామర్ బ్యూటీ దీపికా పదుకొణె జ్యూరీ మెంబర్ గా ఎంపికయ్యింది. ఈ ఫెస్టివల్ కు భారత్ నుండి కొంతమంది ప్రముఖ సినీతారలు హాజరుకాబోతున్నారు. వారిలో మ్యూజిక్ దిగ్గజం ఏ ఆర్ రెహ్మాన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, ఆర్. మాధవన్, తమన్నా భాటియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బుల్లి తెర నటులు హేలీ షా, హీనా ఖాన్ ఉన్నారు. 


అంతకుముందు వరకు ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ తారలు మాత్రమే ఈ ఫెస్టివల్ కు హాజరయ్యే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది. ఈ సారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కేవలం బాలీవుడ్ సెలెబ్రిటీలనే కాక, సౌత్ నుండి కూడా తారలను ఎంపిక చెయ్యటం విశేషం. పూజా హెగ్డే, తమన్నా వంటి వారు సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో బాగా ప్రాచుర్యం పొందిన హీరోయిన్లు కాబట్టి ఒక విధంగా, వీరిద్దరూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనటం తెలుగు వారికి గర్వకారణం. 


ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి సినిమా షూటింగుతో బిజీగా ఉన్న పూజా ఒక రెండు రోజులు ఈ సినిమాకు విరామమిచ్చి కేన్స్ కు హాజరవనుంది. ఇక తమన్నా ఆల్రెడీ కేన్స్ కు పయనమయ్యేందుకు సిద్ధంగా ఉంది. అక్కడి నుండి వచ్చిన తర్వాత తన కొత్త సినిమా ఎఫ్3 ప్రమోషన్స్ లో పాల్గొననుంది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM