రెండోరోజు సర్కారోడి పరుగు మాములుగా లేదుగా

by సూర్య | Sat, May 14, 2022, 12:39 PM

ఈ గురువారం ధియేటర్లకొచ్చిన మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కింది. తొలిరోజు అత్యధికంగా రూ. 75కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా SVP రికార్డు సృష్టించింది. మొదటి రోజుకన్నా రెండో రోజు అంటే శుక్రవారం ఈ సినిమా వసూళ్లు బాగా పుంజుకున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా గురువారం విడుదలైన సినిమాలు ఆ రోజు కలెక్షన్లు బాగానే ఉన్నా, శుక్రవారం పని దినం కాబట్టి ఆ రోజు కలెక్షన్లలో డ్రాప్ ఉంటుంది. కానీ విచిత్రంగా మహేష్ బాబు చిత్రానికి రెండో రోజు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ఉదయం ప్రదర్శనల కన్నా, సాయంత్రం, రాత్రి పూట షోలకు మంచి డిమాండ్ ఏర్పడిందట. రెండో రోజు 11.64 కోట్లను వసూలు చేసిన SVP మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకు కలిపి 48.27 కోట్ల షేరును సాధించింది. ఇక శని, ఆదివారాల్లో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్లు రావొచ్చని అంచనా. అంతేకాక, మరో రెండు వారాల వరకు ఏ పెద్ద హీరో సినిమా విడుదలకాకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. 


ఇరు తెలుగు రాష్ట్రాలలో SVP రెండు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే... నైజాం-17.44 కోట్లు, సీడెడ్ -6.15కోట్లు, ఉత్తరాంధ్ర - 5.38కోట్లు, ఈస్ట్ గోదావరి- 4.33కోట్లు, వెస్ట్ - 3.19 కోట్లు, గుంటూరు - 6.34కోట్లు, కృష్ణ - 3.47 కోట్లు, నెల్లూరు - 1.97కోట్లు. మొత్తం 48.27కోట్లు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM