ఫేమ్ ఉన్నా కానీ నాగశౌర్య ఎందుకు వెనక్కు వెళ్తున్నాడు?

by సూర్య | Sat, May 14, 2022, 01:03 PM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం కృష్ణ వ్రిoద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో, ఐరా క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహాతి స్వరసాగర్ స్వరాలనందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు యువతను ఆకర్షిస్తున్నాయి. నాగసౌర్య స్టైలిష్ లుక్స్, షెర్లీ గ్లామర్ తో ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో తగినంత బజ్ క్రియేట్ అయ్యింది. కానీ, ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావటానికి సంశయిస్తూనే ఉంది. 


ఆర్ ఆర్ ఆర్, ఆచార్య వంటి బిగ్ సినిమాలకు భయపడి ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఆఖరికి మే 20న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ తేదీ మారినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, మే 12న మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారువారిపాట  విడుదలయ్యింది. తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికి నెమ్మదిగా ఈ సినిమాకు ప్రేక్షకుల రాక, కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇంకా, మే 27న వెంకటేష్, వరుణ్ తేజ్ ల కామెడీ ఎంటర్టైనర్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం ఎప్పటినుండో ప్రేక్షకులు కాచుకుని కూర్చున్నారు. ఇక ఈ మధ్యలో అంటే మే 20 న తన సినిమాను విడుదల చెయ్యటం సరైన నిర్ణయమేనా అని నాగశౌర్య ఆలోచిస్తున్నాడట. ఇంత కాంపిటీషన్ సమయంలో వచ్చి చెయ్యి కాల్చుకునే కన్నా మరో విడుదల తేదీని ఖరారు చేసుకుంటే పోతుందని, తాత్కాలికంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు నాగశౌర్య సినిమా కోసం ఎదురు చూస్తుంటే, నాగశౌర్య మాత్రం మంచి ముహూర్తం కోసం చూస్తూ ఈ మూవీని ఆలస్యం చేస్తున్నాడు. ఈ సారి ఈ సినిమా మరింత ఆలస్యమైతే ప్రేక్షకుల్లో ఉన్న ఆకాస్త పాజిటివ్ బజ్ కూడా పోతుంది. ఏదిఏమైనా నాగశౌర్య కొంచెం ధైర్యం చేసి ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేస్తే బావుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM