కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా కొత్త సినిమా ప్రారంభం

by సూర్య | Fri, May 13, 2022, 08:44 PM

కేరింత లో నూకరాజు గా నటించిన పార్వతీశం, జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా ఒక కొత్త చిత్రం ప్రారంభమైంది. వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. దేవరకొండలో విజయ్ ప్రేమకథ ఫేమ్ వెంకటరమణ దర్శకత్వంలో ఒక సందేశాత్మక చిత్రం గా రూపొందుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాకినాడ, యానాం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. సామాజిక సందేశానికి  విభిన్నమైన ప్రేమకథను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. 50రోజుల్లో మొత్తం షూటింగును పూర్తి చేసి వీలైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.

Latest News
 
పాన్ ఇండియా సినిమాలపై మరోసారి సిద్దార్ధ్ షాకింగ్ కామెంట్స్ Thu, May 19, 2022, 08:57 PM
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM