'ఆచార్య' నుండి భలే భలే బంజారా ఫుల్ సాంగ్ ఔట్

by సూర్య | Fri, May 13, 2022, 08:57 PM

కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. వెండితెరపై తండ్రీకొడుకులు ఎక్కువ నిడివి కనిపించటం ఇదే తొలిసారి. ఇందులో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమంది. అయితే, ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ మాత్రం యూట్యూబులో సెన్సేషన్ హిట్ అయింది. లాహే లాహే, భలే భలే బంజారా, నీలాంబరి, సానా కష్టం పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మణి శర్మ సంగీతం అందించిన ఈ మూవీ నుండి తాజాగా భలే భలే బంజారా పూర్తి పాటను యూట్యూబులో రిలీజ్ చేసారు. చరణ్, చిరులిద్దరు స్టెప్పులతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ చేసిన భలే భలే బంజారా పాట ఫుల్ వీడియో విడుదలవడంతో  మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM