సూపర్ స్టార్ సినిమాలో పవర్ స్టార్ మెరుపులు

by సూర్య | Fri, May 13, 2022, 08:39 PM

పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారిపాట. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ చిత్రం తొలి షో తోనే మిక్స్డ్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది. అయితే, కలెక్షన్లు మాత్రం మోత మోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతుంది. ట్రైలర్ లోనే ఈ సినిమాలో డైలాగ్స్, యాక్షన్ ఎలా ఉండనున్నాయో ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చేసింది. ఈ సినిమాలోని నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్ ట్రైలర్ విడుదల సమయంలోనే బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత మరో డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. "ఒక సన్నివేశంలో మహేష్ జనం తోడు ఉన్నవాడు గెలవకపోయినా ... ఆఖరికి జనమే అతనికి తోడుగా నిలబడతారు" అని చెప్తాడు. ఈ డైలాగ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుబ్బరాజ్ మొబైల్ రింగ్ టోన్ గా లా లా భీమ్లా ... పాట ఉంటుంది. పదే పదే సుబ్బరాజ్ కు మహేష్ ఫోన్ చెయ్యటం, భీమ్లా రింగ్ టోన్ మోగటంతో పవర్ స్టార్ అభిమానుల ఈలలు, గోలతో  థియేటర్లలో రీసౌండ్ వస్తుంది. సూపర్స్టార్ సినిమాలో పవర్ స్టార్ మెరుపులు ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM