![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 05:39 PM
కేరళ రాష్ట్రానికి చెందిన నటి, మోడల్ షహనా (20) అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. కోజికోడ్ కు 14 కి.మీ దూరంలోని పరాంబిల్ బజార్ లో ఆమె తన భర్త సజ్జద్ తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. వారికి ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది. షహనా మృతదేహం గురువారం రాత్రి 11.30 కి అపార్ట్మెంట్ లోని కిటికీ ఊచలకు వేలాడుతూ కనిపించింది. షహనా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపించారు. ఆమెను తన భర్త ఎప్పుడూ హింసించేవాడని షహనా చెబుతూ ఉండేదని షహనా తల్లి చెప్పారు. హత్య ఆరోపణల నేపథ్యంలో షహనా భర్త సజ్జద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షహనా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆమె మృతి వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.