డివోర్స్ తీసుకోనున్న బాలీవుడ్ స్టార్‌ కపుల్స్

by సూర్య | Fri, May 13, 2022, 05:27 PM

సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ విడాకుల విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ముంబై ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి విడాకులకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియలేదు. 1998లో సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నిర్వాన్‌, యోహాన్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. గతంలో 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని వార్తలు రాగా, సీమా వాటిని ఖండించింది. ఏ బంధంలో అయినా గొడవలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లలే చాలా ముఖ్యమని పేర్కొంది. తాజాగా ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM