అభిమానులకు రానా భార్య రిక్వెస్ట్..!!

by సూర్య | Tue, Oct 26, 2021, 12:42 PM

బిగ్ బాస్..సీజన్ 5. చూస్తూ చూస్తూనే ఏడు వారలు కంప్లీట్ చేసుకునింది. అయినా కానీ హౌస్ లో రచ్చలు..మనస్పర్ధలు..గొడవలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరు తామే టైటైల్ విన్ అవుతాం అంటూ..ధీమా వ్యక్తొ చేస్తున్నారు. రోజుకో టాక్ పేరుతో బిగ్ బాస్ తన స్ట్రాటజీ ఫాలో అవుతూ.. స్నేహంగా ఉన్న కంటెస్టేంట్స్ మధ్య చిచ్చులు పెట్టడానికి చూస్తున్నాడు. ఇక యాంకర్ రవి అయితే తనకున్న తెలివితేటలను మొత్తం ఆటలో పెట్టేసి మరీ ఆడుతున్నాడు.ఇది ఇలా ఉండగా .. టాలీవుడ్ కండల వీరుడు భార్య బిగ్ బాస్ షోలో తన సపోర్ట్ ఎవరికో చెప్పేసింది. యస్.. ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తుందో చెప్పుతూ ఓ వీడియో ను షేర్ చేసింది. ప్రస్తూం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా..??.. అక్షర రెడ్డి. షాక్ అయ్యారా..ఇదేంటి ఈ పేరు గల కంటెస్టేంట్ బిగ్ బాస్ హౌస్ లో లేరు గా అనుకుంటున్నారా..హా మి గెసింగ్ కరెక్ట్. అక్షర రెడ్డి అనే ఆమె తెలుగు బిగ్ బాస్ లో లేదు. తమిళ బిగ్ బాస్ హౌస్ లో ఉంది.


తమిళంలో కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి కూడా ఒకరు. ఈమె ఒక మోడల్‌. అంతేకాదు మిస్‌ గ్లోబ్‌ 2019 అవార్డు గ్రహీత కూడా. గతంలో 'విల్లా టు విలేజ్‌' అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.ఇక మిహికా.. ఆమెకు తన సపోర్ట్ తెలిపింది. బిగ్‌బాస్‌ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు. నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్‌ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్‌ ద బెస్ట్‌' అంటూ వీడియో షేర్ చేసింది మిహికా.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM