జడ్జి చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయ : విజయ్

by సూర్య | Tue, Oct 26, 2021, 12:40 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ కొన్ని నెలల ముందు తన కారు పన్ను తగ్గించాలని కోరుతూ పిటిషన్ దఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ పిటిషన్ స్వీకరించిన చెన్నై హైకోర్ట్ ఈ కేసును తోసిపుచ్చింది. అంతేకాకుండా.. విజయ్ కు లక్ష రూపాయాల జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తాన్ని కరోనా రిలీఫ్ ఫండ్‏కు చెల్లించాలని ఆదేశించింది. దీంతో కారు దిగుమతి సుంకం రూ. 32.30 లక్షలను చెల్లించారు.. అలాగే నటీనటుల పన్ను మినహాయింపులను తాము అంగీకరించలేమని.. తెరపైనే హీరోలు కాకుండా.. నిజజీవితంలోనూ హీరోలు కావాలని తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. పిటిషన్‏లో విజయ్ తన వృత్తిని పేర్కోనకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది.అయితే విజయ్ లగ్జరీ కారు పన్ను మినహాయింపు కేసు విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అప్పుడు మద్రాసు హైకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు అప్పటి జడ్జి చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి తనను సంబోంధించిన తీరు సరిగ్గా లేదన్నారు. బకాయి పన్ను చెల్లించాం.. కేవలం ఎంట్రీ ట్యాక్స్ కట్టలేదు. ఆ విషయంలో పన్నూ మినహాయింపు కోరుతూ కేసు పెట్టామన్నారు. విచారణ సమయంలో న్యాయమూర్తి నన్ను జాతి వ్యతిరేకిగా సంబోధించారు.. నన్ను ఒక నేరగాడిగా చిత్రీకరించే రీతిలో ఆయన మాట్లాడిన తీరు నాకెంతో బాధ కలిగిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. నా కేసు విషయంలోనే కాదు.. హీరో ధనుష్, హీరో సూర్య విషయంలోనూ అలా బహిరంగంగా వ్యాఖ్యనించారు అన్నారు. ఇక న్యాయమూర్తి గత తీర్పులో పేర్కొన్న అంశాల్ని రద్దు చేయాలని కోరుతూ కొత్త పిటిషన్ దాఖలు చేశారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM