'పక్కా కమర్షియల్' గా గోపి చంద్ ?

by సూర్య | Sat, Jun 12, 2021, 03:03 PM

గోపిచంద్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న రెండు కొత్త సినిమాల నుండి కొత్త లుక్స్ విడుదలయ్యాయి. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రం నుండి లుక్ వదిలారు. ఇందులో గోపిచంద్ చాలా క్లాసీగా కనిపిస్తున్నాడు.  స్టైలిష్ ఫార్మల్ డ్రెస్ వేసి క్యాచింగ్ స్మైల్ తో అల్ట్రా పోష్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.  ఫ్యాన్స్ అయితే లుక్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  మారుతి సినిమాల్లో హీరోలు అందంగానే ఉంటారు.  ఇక ఈ లుక్ చూసాక గోపీచంద్ మరింత అందంగా కనిపిస్తాడనే నమ్మకం కలుగుతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ మూలంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. మొదలవ్వడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. గోపీచంద్ సంపత్ నంది దర్సకత్వంలో ‘సీటిమార్’ చిత్రం చేస్తున్నారు.  ఇంకొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.  త్వరలోనే చిత్రీకరణ రీస్టార్ట్ కానుంది.  


 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM