'స్టేట్ కి ఒక్కడు'మన పవర్ స్టార్ టైటిల్ ?

by సూర్య | Sat, Jun 12, 2021, 03:22 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు కూడా ఉన్నాయో అందరికీ తెలిసిందే.. ఈ మధ్యనే వచ్చిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కే ఏకంగా దర్శకుడు సహా నిర్మాతలు వచ్చి అధికారిక అప్డేట్ ను ఇచ్చారు.. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ ను చూసిన నాగబాబు కూడా స్పందించారు. వావ్ అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు తాజాగా అభిమానులు పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఇదే అంటూ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ఈ సినిమాకు టైటిల్ ‘ స్టేట్ కి ఒక్కడు’ అని పెట్టారు. పోస్టర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. ఈ టైటిల్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ టైటిల్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కాగా జూలై నుంచి పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, ఆ తర్వాత హరిహర వీరమల్లుకు డేట్స్ కేటాయించనున్నాడు. ఈ రెండు ఫినిష్ చేసిన తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా మొదలు కానుంది. కాగా ఇటీవల హరీష్ శంకర్ కూడా పవన్ తో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM