యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతున్న కెజిఫ్ 2 టీజర్ ?

by సూర్య | Tue, Jun 01, 2021, 03:05 PM

యూట్యూబ్ లో అతి తక్కువ రోజుల్లో అత్యధిక కామెంట్లు పొందిన తొలి శాండిల్ వుడ్ టీజర్ గా 'కేజీయఫ్ - 2' టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1 మిలియన్ (10 లక్షలు) పైగా కామెంట్స్ రాబట్టిన ఈ టీజర్.. ఈ రికార్డ్ నమోదు చేసిన నాల్గవ ఇండియన్ టీజర్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 188 మిలియన్స్ కి పైగా వ్యూస్.. 8 మిలియన్లకి పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.కాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'కేజీఎఫ్ 2' చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడు ‘అధీరా’ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం సమకూరుస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM