కేజీయఫ్ 2 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్?

by సూర్య | Mon, May 31, 2021, 12:47 PM

కేజిఫ్ చాప్టర్ 2 మూవీపై అంచనాలు భారీ ఎత్తున ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కేజిఫ్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దాని సీక్వెల్ గా కేజిఫ్ 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కన్నడ స్టార్ యాష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు.మరి ఈ గ్యాప్ లో మేకర్స్ ఈ చిత్రంలో కీలక నటుల పుట్టినరోజుకి గాను కేజీయఫ్ టైమ్స్ మ్యాగ్జైన్ పేరిట పలు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వదులుతూ వస్తున్నారు. మరి అలా ఈ చిత్రంలో మరి ఇంట్రెస్టింగ్ పాత్ర “ఇనాయత్ ఖలీల్” గా చేస్తున్న నటుడు బాలకృష్ణ పై లేటెస్ట్ డీటెయిల్ వదిలారు.ఇనాయత్ ఖలీల్ అతి పెద్ద సామ్రాజ్యం నారాచి ని ఆక్రమించడానికి ఎవరితో చేతులు కలుపుతాడు?అలాగే తన బర్త్ డే ని ఇండియాలో ఎక్కడో తెలియని ప్లేస్ లో జరుపుకుంటున్నాడని అందులో పొందుపరిచారు. మరి ఇతని రోల్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM