దళపతి విజయ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్.!

by సూర్య | Sun, May 30, 2021, 05:16 PM

ఇళయదళపతి విజయ్‌ అభిమానుకు గుడ్‌ న్యూస్‌ ఇది. త్వరలోనే ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కన్‌ఫర్మ్‌ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అటు విజయ్ గానీ ఇటు వంశీ పైడిపల్లి గానీ స్పందించలేదు. దీంతో ఇది కేవలం రూమరే అని అంతా కొట్టిపారేశారు. అయితే తాజాగా విజయ్‌తో తన సినిమా ఉండబోతోందని, ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు వంశీ పైడిపల్లి తెలిపాడు. లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తామని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా విజయ్‌కి టాలీవుడ్‌లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కాల్సి ఉండగా అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం విజయ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే వంశీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM