హీరో నిఖిల్ ఇంట్రెస్ట్ గా 18 పేజెస్ మూవీ!

by సూర్య | Sat, May 29, 2021, 01:36 PM

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్.ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న ’18 పేజీస్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఇక ఈ గ్యాప్ లో ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇందులో నిఖిల్ సిగరెట్ తాగుతూ.. కాలిపోతున్న ఓ పేజీని పట్టుకొని ఉన్నాడు. ఆ పేజీపై జూన్ 1న ’18 పేజీస్’ ఫస్ట్ లుక్ అని రాసి ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఫస్ట్ లుక్ ను ఎలా డిజైన్ చేశారో చూద్దాం.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM