వకీల్ సాబ్ సినిమాలో మైనస్ పాయింట్ అదేనా?

by సూర్య | Sat, Apr 10, 2021, 07:49 AM

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఆనందంగా ఉన్నారు. కానీ ఈ సినిమాలో ఒక మైనస్ పాయింట్ ఉందని చాలా మంది చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాసుకున్న కొన్ని సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయని, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వర్కవుట్ కాలేదని అంటున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథను అది చాలా ఇబ్బంది పెట్టిందని ఫ్యాన్స్ కూడా మనసులో మాట చెప్పేశారు. అయితే సెకండాఫ్ మాత్రం సినిమా రేంజ్ ను పెంచేసిందని, ఇంటర్వెల్ తర్వాత మొదలైన కోర్టు డ్రామా క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా కొనసాగిందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ మరీ ఎక్కువ సమయం పెట్టారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం జనసేన ప్రచారం సినిమాలో ఎక్కువైంది అంటూ పెదవి విరుస్తున్నారు. ఇది తప్పితే వకీల్ సాబ్ లో వంకలు పెట్టడానికి ఏం లేవు అంటున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM