దేశం కాని దేశంలోనూ దళపతి కి ఫ్యాన్స్ ఘన స్వాగతం

by సూర్య | Fri, Apr 09, 2021, 05:12 PM

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం తిరుగులేని మాస్ హీరో అంటే దళపతి విజయే! ఆయన కోసం ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఆయన సినిమాల కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలే. ఒకవైపు కరోనా కలవరం కొనసాగుతూనే ఉన్నా విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా ఆ మధ్య విడుదలై రికార్డులు సృష్టించింది. అయితే, ప్రస్తుతం విజయ్ తన తరువాతి చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు...ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ 'తళపతి 65' మూవీకి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇదే సినిమాతో మన బుట్ట బొమ్మ తమిళ తెరపైకి ఎంట్రీ ఇస్తోంది. అయితే, విజయ్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు యూరప్ వెళ్లారు. జార్జియా ఎయిర్ పోర్ట్ లో దిగిన కోలీవుడ్ స్టార్ హీరో బయటకు వస్తుంటే గ్రాండ్ వెల్కమ్ లభించింది. జార్జియాలోని ఆయన ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. దేశం కాని దేశంలోనూ విజయ్ క్రేజ్ చూసి ఇప్పుడు నెటిజన్స్ 'దళపతి 65' మూవీ పిక్స్ అండ్ వీడియోస్ వైరల్ చేస్తున్నారు. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM