ఓవర్సీస్లో లోను ‘వకీల్ సాబ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్...!

by సూర్య | Sat, Apr 10, 2021, 08:34 AM

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ హీరోగా  రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’.  పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఆనందంగా ఉన్నారు. పవన్ ‘వకీల్ సాబ్’ మేనియా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడ స్పష్టంగా కనబడింది. లాక్ డౌన్ తర్వాత యూఎస్ఏలో తెలుగు సినిమాలు గొప్ప పెర్ఫార్మెన్స్ చూపింది లేదు. ఒక్క ‘జాతిరత్నాలు’ మినహా మిగతా సినిమాలన్నీ ప్రభావం చూపలేకపోయాయి. కోవిడ్ కారణాల రీత్యా అమెరికాలోని తెలుగువారు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానం కలిగింది. హక్కులేమో దాదాపు 5 కోట్ల పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ మొత్తం వెనక్కి రావాలంటే మొదటిరోజు సాలిడ్ ఓపెనింగ్స్ రావాలి. పవన్ మేనియాతో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్ల ద్వారా మంచి వసూళ్లు సాధించింది. మొత్తం 226 లొకేషన్లలో 296,885 డాలర్లను వసూలు చేసింది. లాక్ డౌన్ తర్వాత అందులోనూ కరోనా కల్లోలంలో ఈ స్థాయి వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ జోరులోనే వసూళ్లు కొనసాగితే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అమెరికాలోనే కాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడ ‘వకీల్ సాబ్’ ప్రభావం కనబడుతోంది. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM