ఆడబిడ్డకు జన్మనిచిన్న బిగ్ బాస్ బ్యూటీ

by సూర్య | Wed, Apr 07, 2021, 02:52 PM

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హరితేజ. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హరితేజ తనదైన అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలోను నటించి ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాలోను కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు హరితేజ. రీసెంట్‌గా అల్లుడు అదుర్స్, జాంబి రెడ్డి సినిమాల్లో కనిపించారు హరితేజ. తాజాగా హరితేజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల తాను కన్సీవ్ అయ్యాను అంటూ హరితేజ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో ఖాతాల్లో బేబీ బంప్‌తో దిగిన ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉన్నారు. తాజాగా తనకు ఆడ బిడ్డ పుట్టిందనే విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు హరి తేజ.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM