'వకీల్ సాబ్' నుండి విడుదలైన ప్రబోధాత్మక గీతం ఇదిగో!

by సూర్య | Wed, Apr 07, 2021, 03:07 PM

పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి ఓ ప్రబోధాత్మక గీతం విడుదలైంది. 'కదులు కదులు కట్లు తెంచుకుని కదులు' అంటూ సాగే ఈ రోమాంఛక గీతాన్ని చిత్రయూనిట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. తమన్ బాణీలకు సీనియర్ లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' నుంచి విడుదలైన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ఈ 'కదులు కదులు' సాంగ్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక గీతం తమన్ ఆర్కెస్ట్రయిజేషన్ లో మరింత ఊపు తెచ్చేదిగా ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వకీల్ సాబ్' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.

Latest News
 
రన్ టైమ్ ని లాక్ చేసిన 'రత్నం' Thu, Apr 25, 2024, 08:28 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 08:27 PM
రేపే 'టిల్లు స్క్వేర్' డిజిటల్ అరంగేట్రం Thu, Apr 25, 2024, 08:23 PM
రేపు రివీల్ కానున్న 'ఒదెల 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 25, 2024, 08:21 PM
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM