ఆడియన్స్ లేక షోలు బంద్...?

by సూర్య | Wed, Mar 24, 2021, 05:28 PM

క‌రోనా వైరస్ నుంచి కాస్త కోలుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మంచి విజయాలు వచ్చాయి. ప్రతీ వారం విడుదలవుతున్న సినిమాల్లో కనీసం ఒక్కటైనా సత్తా చూపిస్తూ వచ్చింది. ప్రతీ శుక్రవారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. అందుకే ఒక్క సినిమా కచ్చితంగా గెలుపు బాట పట్టింది. అయితే ఈ ఏడాది తొలిసారి ఓ శుక్రవారం పూర్తిగా కనుమరుగైపోయింది. మూడు సినిమాలు విడుదలైన అందులో ఒక్కటి కూడా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనాలు లేక థియేటర్ యాజమాన్యం షోలు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన చావు కబురు చల్లగా లాంటి సినిమాలకు కూడా కనీస స్పంద‌న లేకపోవడంతో ఏం చేయాలో తెలియక థియేట‌ర్లు క్లోజ్ చేసుకున్నారు. కనీసం మెయింటైనెన్స్ కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి నుంచి ప్రతీసారి కనీసం ఒక్క సినిమా బాగా ఆడుతూనే ఉంది. క్రాక్, మాస్టర్, రెడ్ లాంటి సినిమాల తర్వాత ఫిబ్రవరిలో అందరి కరువు తీరుస్తూ ఉప్పెన వచ్చింది. మార్చిలో జాతిర‌త్నాలు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ సందడి పెరిగింది. అయితే ఈ సినిమా రెండు వారాలు బాగానే ఆడింది. కానీ మూడో వారం జోరు తగ్గిపోయింది. మార్చ్ 19న విడుదలైన చావు కబురు చల్లగా, మోసగాళ్లు, శశి సినిమాలకు దారుణమైన టాక్ వచ్చింది. ఈ మూడు సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు కనీసం వాటి వైపు వెళ్లలేదు. దాంతో వీటి పరిస్థితి మరీ ద‌య‌నీయంగా మారిపోయింది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM