ప్రగ్య బర్త్ డే సెలబ్రేషన్స్..

by సూర్య | Sat, Jan 16, 2021, 11:03 AM

కంచె చిత్రంతో ఆరంగేట్రమే పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది ప్రగ్య జైశ్వాల్. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో పుట్టి పెరిగిన ఈ భామ స్వతహాగా మోడల్. అనేక అందాల పోటీలలో పాల్గొంది. విజయవంతమైన మోడల్ గానూ రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాలని కలలుగన్నా అదేమీ అంత సులువుగా దక్కలేదు.ప్రస్తుతం ప్రగ్య సినీ కెరీర్ అంతంత మాత్రమే. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్లు అయితే లేవ్. ఇటీవల కంబ్యాక్ కోసం ప్రగ్య చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. దర్శకనిర్మాతల్ని ఆకర్షించేందుకు నిరంతర ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. తనని తాను లైమ్ లైట్ లో ఉంచేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా లోపం ఎక్కడుందో కానీ ప్రగ్యకు వెంటనే స్టార్ల నుంచి ఆఫర్లు లేవు. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే తదుపరి చిత్రంలో ప్రగ్యకు అవకాశం దక్కిందని ఓ ప్రముఖ దర్శకుడి రికమండేషన్ ఉందని కూడా ప్రచారమైంది. కానీ దానిపైనా అధికారిక సమాచారం ఏదీ రాలేదు. ఇంతకుముందు సైరాలో నటిస్తుందని కూడా ప్రచారమైనా అది గాసిప్ అని తేలింది. ఇటీవలే మంచు విష్ణు- వైట్ల కాంబో మూవీ ఢీ సీక్వెల్ కి ప్రగ్య సంతకం చేసిందని ప్రచారమైంది.


ఇకపోతే ప్రగ్య షేర్ చేసిన తాజా రెడ్ హాట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రగ్య బర్త్ డే సెలబ్రేషన్స్ నుంచి ఫోటో ఇది. ఇక ఇటీవల మేకోవర్ కోసం జిమ్ముల్లో చాలా తీవ్రంగా శ్రమించిన ప్రగ్య లో ఆ మార్పు తనలో స్పష్ఠంగా కనిపిస్తోంది. హాటెస్ట్ మిల్కీ సొగసుల్ని.. థై సొగసుల్ని ఎలివేట్ చేయడంలో ప్రగ్య స్పీడ్ గురించి మరోసారి యూత్ లో చర్చ మొదలైంది.





 


 


 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM