మ్యూజిక్ ఆల్బమ్ లో తొలిసారిగా ‘సోనూసూద్’

by సూర్య | Sat, Jan 16, 2021, 09:06 AM

తొలిసారి ఓ మ్యూజిక్ వీడియోలో నటించాడు హీరో సోనూసూద్. సింగ‌ర్ సునంద శ‌ర్మతో క‌లిసి పాగ‌ల్ న‌హీ హోనా మ్యూజిక్ వీడియోలో న‌టించాడు. ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య‌ రొమాంటిక్ గా సాగుతుందీ పాట‌. సోనూసూద్ ఆర్మీ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌గా..అత‌న్ని ప్రేమించే యువ‌తిగా సునంద శ‌ర్మ న‌టించింది. ప‌ట్ట‌ణానికి దూరంగా సోనూసూద్ కు పోస్టింగ్ వ‌స్తోంది. అయితే సునంద త‌న ప్రియుడు తిరిగొచ్చే వ‌ర‌కు వెయిట్ చేస్తుంది. చివ‌రికి ఇద్ద‌రు క‌ల‌వ‌డంతో వీడియో ముగుస్తుంది. పింకీ ధ‌లివాల్-మ్యాడ్ 4 మ్యూజిక్ సంయుక్తంగా స‌మ‌ర్పిస్తున్న ఈ పాట‌ను జాని రాయ‌గా..అవ్విస్రా కంపోజ్ చేశారు. ఇది నా తొలి మ్యూజిక్ వీడియో. కాన్సెప్ట్ విన‌గానే వెంట‌నే ఒకే చెప్పాను. పాగ‌ల్ న‌హీ హోనా సాంగ్ ను ఆర్మీ జ‌వాన్ల‌కు, వారి ప్రేమించే వారికి అంకిత‌మిస్తున్నా. పాట లిరిక్స్ మీ మ‌న‌స్సును హ‌త్తుకుంటాయి. సునంద చాలా అందంగా పాడింది అంటూ సోనూసూద్ ట్వీట్ చేశాడు.


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM