శ్రీదేవి త‌న‌య బెల్లీ డ్యాన్స్

by సూర్య | Wed, Jan 13, 2021, 09:28 AM

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ద‌ఢ‌క్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే సినీ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న జాన్వీ  ఇటీవ‌ల గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. భారతదేశపు మొదటి మహిళా పైలట్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే జాన్వీ క‌పూర్ త‌ర‌చుగా ఫొటోస్ లేదంటే ప‌లు వీడియోస్ షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తూ ఉంటుంది.


తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయ‌గా,  ఇందులో  అశోక చిత్రం నుండి శాన్ సనానా అనే ట్రాక్‌కి బెల్లీ డ్యాన్స్ చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఒరిజిన‌ల్ పాట‌కు క‌రీనా క‌పూర్ డ్యాన్స్ చేయ‌గా, ఇప్పుడు అదే పాట‌కు జాన్వీ త‌న మనోహ‌ర‌మైన నృత్యంతో అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తుండ‌గా, ఆమె ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 


 


 


 


 


 


 


 





Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM