లీక్ అయిన 'మాస్టర్'..

by సూర్య | Tue, Jan 12, 2021, 05:09 PM

రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' ఒరిజినల్ కాపీ ఆన్ లైన్ లో విడుదలై నిర్మాతలకు షాకిచ్చింది. భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదల కానుండగా, మొత్తం సీన్లతో సినిమా లీక్ అయింది. నిన్నటి నుంచి ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తమ స్టాటస్ మెసేజ్ లుగా వీటిని పెడుతుండటంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది" అని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ కనకరాజ్ వ్యాఖ్యానించారు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM