తమిళ ,మలయాళ,కన్నడ సినిమాలపై శ్రద్ధ ఫోకస్

by సూర్య | Thu, Jan 07, 2021, 09:49 AM

'జెర్సీ' బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను ప్రేక్షకులు మరిచిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే నాని కథానాయకుడిగా .. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రద్ధ పోషించిన పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. అందువలన ఆమెను ఆడియన్స్ బాగానే గుర్తుపెట్టుకున్నారు. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో శ్రద్ధ ఆకట్టుకుంటుంది. ఇక నటన పరంగా కూడా ఆమెకి వంకబెట్టలేం. ఆమె నటన కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. అలాంటి అమ్మాయికి 'జెర్సీ' తరువాత ఆ స్థాయి హిట్ రాలేదు .. ఆ స్థాయి పాత్ర కూడా పడలేదు. ఒక మంచి హిట్ పడినప్పుడు .. ఆ తరువాత చేసే సినిమా ఆ స్థాయికి మించి లేకపోయినా కనీసం ఆ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. అలా ప్లాన్ చేసుకున్నవారే కెరియర్ పరంగా నాలుగు అడుగులు ముందుకు వెళతారు. లేదంటే ఏడు అడుగులు వెనక్కి రావలసి ఉంటుంది. శ్రద్ధ శ్రీనాథ్ అలా వెయిట్ చేయకుండా వచ్చిన ఒకటి రెండు చిన్న సినిమాలు చేసేసింది. అవి కాస్తా ఆమెను వెక్కిరించుకుంటూ వెళ్లిపోయాయి. ఫ్లాప్ స్టిక్కర్ అంటించుకున్నాక దగ్గరగా వచ్చిన అవకాశాలు కూడా వెంటనే యూటర్న్ తీసుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది.


 


అందువల్లనేనేమో శ్రద్ధ శ్రీనాథ్ తమిళ .. మలయాళ .. కన్నడ .. సినిమాలపై ఫోకస్ పెట్టింది. అమ్మాయి గట్టిగానే ట్రై చేసి ఉంటుంది. అందువల్లనే అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తమిళంలో మాధవన్ .. విశాల్ వంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. త్వరలో ఆ సినిమాలు థియేటర్స్ కి రానున్నాయి. ఇక కన్నడలోను మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు మలయాళంలో మోహన్ లాల్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న 'ఆరాట్టు' సినిమాలోనూ నటిస్తోంది. ఏదో తెలుగులో 'నరుడి బ్రతుకు నటన' అనే చిన్న సినిమా ఒక్కటే చేస్తోంది పాపం అనుకునేవారికి అమ్మడు ఈ విధంగా షాక్ ఇచ్చింది. చేతిలో ఎనిమిది సినిమాలు పెట్టుకుని దూకుడంటే ఇది .. అని నిరూపిస్తోంది.


 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM