సెకండ్‌ హీరోయిన్‌ గా మాళవిక నాయర్ ?

by సూర్య | Thu, Jan 07, 2021, 11:54 AM

మాళవిక నాయర్ కి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించినా కూడా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. పర్సనల్ కెరియర్ ని పెంచుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు అమ్మడు తదుపరి అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తోందట. ఇప్పటివరకూ సరైన సక్సెస్ రాక అల్లాడిపోతున్న పాపకి ప్రభాస్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ వస్తుందా రాదా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, తనని టాలీవుడ్ కి పరిచయం చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు.


అందుకే ఆశగా ఎదురుచూస్తోంది. నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమాలు కూడా మంచి రోల్ దొరికినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సినిమాలో కీర్తిసురేష్ ని ఎవరూ కూడా డామినేట్ చేయలేకపోయారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా మాళవికా నాయర్ కి తగిన గుర్తింపు రాలేదు. అయితే, ఇప్పుడు అన్ అఫీయల్ న్యూస్ ఏంటంటే, నాగ అశ్విన్‌ డైరక్షన్‌లో ప్రభాస్ హీరోగా చేస్తోన్న సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మడి పుట్టినరోజు సందర్బంగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ విషెస్‌ చెప్పడంతో ఈ వార్త నిజమే అంటున్నారు అందరూ.అయితే, అతి త్వరలో ఈ సినిమా కూడా సెట్స్‌ పైకి రానుంది కాబట్టి మాళవిక టీమ్ తో జాయిన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక మరోవైపు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికాపదుకునే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమాలో అమితాబ్‌ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అదీ విషయం 


 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM