వాదించిన తర్వాతే యాక్ట్ చేస్తా : మాళవికా శర్మ

by సూర్య | Thu, Jan 07, 2021, 09:35 AM

2018లో ర‌వితేజ స‌ర‌స‌న `నేల‌టిక్కెట్‌` సినిమాలో న‌టించింది మాళవికా శర్మ. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా ఎత్తుప‌ల్లాలు చూసినా… అస‌లు కెరీర్ లాయ‌ర్ అవ్వాల‌నే కోరిక బ‌లంగా వుంది. త‌న తాత‌గారు ప్ర‌ముఖ క్రిమిన‌ల్ లాయ‌ర్‌. తాతగారు చ‌నిపోయాక కోరిక బ‌లంగా మారింది. అందుకు ఆమె తండ్రికూడా ప్రోత్స‌హించారు. అందుకేఎల్‌.ఎల్‌.బి. పూర్తి చేసిన ఆమె ప్ర‌స్తుతం ఎల్‌.‌.ఎల్‌.ఎం.కు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు వ‌చ్చిన సినిమా అవ‌కాశాల్ని చేసుకుంటూపోతుంది. త‌న‌కు అల్లు అర్జున్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌న్ వంటి స‌ర‌స‌న న‌టించాల‌నున్న‌ద‌నే కోరిక‌ను వ్య‌క్తం చేస్తోంది. ఒక‌వేళ అల్లు అర్జున్ తో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన రోజే న్యాయ‌వాదిగా వాదించాల‌సి వ‌స్తే ముందు కోర్టుకు వెళ్ళి న్యాయ వ్య‌వ‌స్థ‌ను కాపాడేందుకు కృషి చేస్తాన‌ని.. ఆ త‌ర్వాతే న‌టిస్తాన‌ని ఇందుకు త‌గిన విధంగా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటాన‌ని చెబుతోంది. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. నాంప‌ల్లి కోర్టుకు వెళ్ళి అక్క‌డ ప‌ట్టాభిగారిని క‌లిసి మెళుకువ‌లు నేర్చ‌కుంటాన‌ని చెబుతోంది. మొద‌టి సినిమాకు తెలుగు స‌రిగ్గా తెలియ‌ద‌నీ, ప్ర‌స్తుతం తెలుగు ట్యూట‌ర్‌ను పెట్టుకున్నాన‌ని.. త్వ‌ర‌లో తెలుగులోనే మాట్లాడ‌తాన‌ని అంటోంది.





 


 


 

Latest News
 
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM
'సత్యభామ' లోని కళ్లారా లిరికల్ వీడియో అవుట్ Thu, Apr 25, 2024, 08:38 PM
'ది 100' టీజర్ ని విడుదల చేయనున్న మెగా మదర్ Thu, Apr 25, 2024, 08:35 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'రత్నం' Thu, Apr 25, 2024, 08:28 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 08:27 PM