కష్టమే కానీ ఇష్టం అంటున్న దియామీర్జా

by సూర్య | Sat, Jan 02, 2021, 09:42 AM

తెలుగు రాని వారికి తెలుగు నేర్చుకోవడం కష్టమయిన పనే..ఆర్ ఆర్ ఆర్ చిత్రంకోసం బాలీవుడ్ చిన్నది ఆలియాభట్ తెలుగు నేర్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అయితే తెలుగు నేర్చుకుంటే మాత్రం ఎప్పటికీ మరచిపోలేం అంటోంది మరో బాలీవుడ్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు దియామీర్జా. ఆమె ఇంకా ఏమందో చూద్దాం..సైకిల్ తొక్కడం..ఈదడం ఒకసారి నేర్చుకుంటే ఎలా మరచిపోమో అలాగే ఏదైనా భాషను మాట్లాడటం నేర్చుకుంటే దాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేమని తెలిపింది ఈ భామ. 


ఇంతకీ దియా మీర్జా పుట్టింది హైదరాబాద్ లోనే. తన బాల్యమంతా కూడా హైదరాబాద్ లోనే గడిచిందని తెలిపిందామె. ఫ్యాషన్‌, మూవీల కారణంగా బాలీవుడ్‌కు చెక్కేసి చాలా ఏళ్లే గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు మూవీలో కూడా దియా మీర్జా నటించకపోవడంతో బాలీవుడ్ భామగా ముద్రపడిపోయింది. కానీ మొట్టమొదటిసారిగా హీరో అక్కినేని నాగార్జునతో కలిసి దియా మీర్జా తెలుగు మూవీలో నటిస్తుండటం విశేషం. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం వైల్డ్‌ డాగ్‌. ఇది తెలుగు థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కుతోంది.ఈ మూవీ షూటింగ్‌ కారణంగా తెలుగు భాషను పునఃశ్చరణ చేసుకున్నట్లు అవుతోందని చెప్పింది దియా. 


పలు విశేషాలను ఆమె మీడియాతో పంచుకుంటూ.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. స్కూల్లో తెలుగు నేర్చుకున్నా. ఆరవ తరగతి వరకు తెలుగు రాయడం, చదవడంవచ్చు. భాషకున్న ప్రత్యేకత ఏంటంటే దాన్ని మనం ఒకసారి నేర్చుకుంటే పూర్తిగా మర్చిపోలేం. రోజువారి కార్యకలాపాల్లో మాట్లాడలేకపోవచ్చు. కానీ ఓసారి మాట్లాడటం ప్రారంభించారో చిన్నతనంలో నేర్చుకున్నదాన్నించి ప్రతీగా గుర్తుకువస్తది. స్కూల్లో నేర్పిన ఓ తెలుగు కవిత నాకు ఇప్పటికీ గుర్తు. ఈ కవితను సెట్స్‌లో వల్లెవేస్తుంటే అందరూ తనను చూసి నర్సరీ పిల్లల మాదిరిగా అనుకుంటూ నవ్వుతున్నారని తెలిపింది.ఈ మూవీలో తన పాత్రపై దియా మాట్లాడుతూ.. వైల్డ్‌ డాగ్‌ అనేది ఓ యాక్షన్‌ ఫిల్మ్‌. గతంలో కూడా యాక్షన్‌ మూవీల్లో భాగమయ్యా. కానీ ఈ మూవీలో వెరీ డ్రామటిక్‌ అండ్‌ ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నా. డెబ్యూట్‌ డైరెక్టర్‌ అహిషోర్‌ సోలమన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM