నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నా : కాజల్

by సూర్య | Tue, Oct 06, 2020, 12:05 PM

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్‌ను వివాహం చేసుకోబోతోందని వార్తలు వస్తున్న వచ్చిన తెలిసిందే. ఈ విషయంపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చేస్తూ ట్వీట్టర్‌లో ప్రకటన చేసింది.


'నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని చాలా సంతోషంతో చెబుతున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. ఈ కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తిస్థాయిలో జరుపుకోనివ్వకుండా చేసింది' అని ఆమె ట్వీట్ చేసింది.


'అయినప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా థ్రిల్‌గా భావిస్తున్నాము. మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ పట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. ఇకపై కూడా నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను' అని కాజల్ ట్వీట్ చేసింది.

Latest News
 
ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రసన్నవదనం' Mon, Apr 29, 2024, 05:18 PM
USAలో ప్రారంభమైన 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ రికార్డింగ్స్ Mon, Apr 29, 2024, 05:15 PM
ఆఫీసియల్ : డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' Mon, Apr 29, 2024, 05:13 PM
'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 05:10 PM
'రామం రాఘవం' టీజర్ అవుట్ Mon, Apr 29, 2024, 05:07 PM