'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Mon, Apr 29, 2024, 05:10 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మెగా-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌ యొక్క సెకండ్ సింగల్ జూన్ 22న విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 15, 2024, 06:39 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలి షెడ్యూల్ జరిగేది ఎప్పటివరకంటే...! Wed, May 15, 2024, 06:11 PM