డియర్ బ్రదర్ తారక్.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది సిద్ధమవుతోంది : రామ్ చరణ్

by సూర్య | Tue, Oct 06, 2020, 12:08 PM

ఎన్టీయార్ అభిమానులకు శుభవార్త. ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం అతి త్వరలో రాబోతోంది. `ఆర్ఆర్ఆర్` యూనిట్ త్వరలో ఎన్టీయార్ స్పెషల్ వీడియోను విడుదల చేయబోతోంది. ఈ నెల 22వ తేదీన రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో `రామరాజు ఫర్ భీమ్` వీడియో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా తాజాగా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశాడు.


దాదాపు ఏడు నెలల తర్వాత `ఆర్ఆర్ఆర్` షూటింగ్ తాజాగా మొదలైంది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ చిత్రబృందం షూటింగ్ ప్రారంభించింది. ముందుగా ఎన్టీయార్‌ వీడియోకు  సంబంధించిన షూటింగ్ జరుగబోతోంది. చిత్ర షూటింగ్ ప్రారంభం కావడం గురించి, `రామరాజు ఫర్ భీమ్` వీడియో గురించి చెర్రీ ట్వీట్ చేశాడు. `తిరిగి `ఆర్ఆర్ఆర్` సెట్స్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. డియర్ బ్రదర్ తారక్.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది సిద్ధమవుతోంది. నేను ప్రామిస్ చేసిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి బహుమతి ఇవ్వబోతున్నా` అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు. చిత్ర షూటింగ్ ప్రారంభం కావడం గురించి ఎన్టీయార్ కూడా ట్వీట్ చేశాడు. `మళ్లీ `ఆర్ఆర్ఆర్` సెట్స్ మీదకు రావడం చాలా ఉత్సాహంగా ఉంది జక్కన్న. వెయిట్ చేయలేకపోతున్నాను బ్రదర్ చరణ్. అక్టోబర్ 22న `రామరాజు ఫర్ భీమ్`` అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశాడు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM