by సూర్య | Mon, Mar 30, 2020, 12:09 PM
'సైరా' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు మెగాస్టార్ లుక్ ను మొదట ఉగాది సందర్భంగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 'ఓ పిట్టకథ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనుకోకుండా మెగాస్టార్ ఈ సినిమా టైటిల్ 'ఆచార్య' అని తెలియజేసారు.ఇక మెగాస్టార్ లుక్ అయినా ఉగాదికి విడుదల చేద్దామని భావిస్తుండగా అదే సమయానికి మెగాస్టార్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో కొరటాల తన ఆలోచనను మార్చుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఇప్పుడు శ్రీరామినవమి రోజున ఆచార్య ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉందట చిత్ర యూనిట్. ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ.. కరోనా వైరస్ ప్రభావంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Latest News