ఏప్రిల్ కూడా చిత్ర పరిశ్రమకు ఊరటనివ్వదా?

by సూర్య | Mon, Mar 30, 2020, 12:07 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తుంది. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి లో విడుదల కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా పడ్డాయి. కాగా ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ఏప్రిల్ లో మొత్తం 13 సినిమాలు విడుదలకు ఉన్నాయి.అందులో నాని 'వి', అనుష్క 'నిశ్శబ్దం', రానా 'అరణ్య' లాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాల విడుదల గురించి నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే మార్చిలో సినిమాలు వాయిదా పడగా.. ఒకవేళ ఏప్రిల్ లో లాక్ డౌన్ మరింత పొడిగిస్తే ఏప్రిల్ లో విడుదలయ్యే సినిమాలు కూడా వాయిదా పడి.. మే ఒక్క నెలలోనే దాదాపు 30 తెలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉంటుంది. దీంతో థియేటర్స్ సరిపోక కలెక్షన్స్ తగ్గి టాలీవుడ్ నష్టాల బాటలో పడడం ఖాయమనిపిస్తుంది.

Latest News
 
"ఎఫ్3" స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 05:54 PM
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM