ఫుల్ బిజీ అవుతున్న నిధి అగర్వాల్!

by సూర్య | Fri, Jan 17, 2020, 06:34 PM

నిధి అగర్వాల్ కూడా ఇలాగే వరుస సినిమాలతో బిజీ అవుతోంది. కెరీర్ ను మళ్లీ ట్రాక్ లోకి ఎక్కిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటోంది. మెగా ప్రాజెక్టులతో మళ్లీ బిజీ అవుతోంది నిధి. వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తోన్న సినిమాలో నిధిని హీరోయిన్ గా తీసుకుంటున్నారని సమాచారం. నిధి అగర్వాల్ కు స్టార్టింగ్ లో రెండు సినిమాలతో భారీ షాకులు తగిలాయి. అక్కినేని బ్రదర్స్ తో కలిసి నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో నిధి అగర్వాల్ కొంచెం స్లో అయింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంతో నిధి కెరీర్ లో కొంచెం మార్పులొచ్చాయి. నిధి అగర్వాల్ వరుణ్ తేజ్ సినిమాతో పాటు మహేశ్ బాబు మేనల్లుడి సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ తో జోడీ కడుతోంది నిధి. సో ఈ లిస్ట్ చూస్తే నిధి అగర్వాల్ మళ్లీ బిజీ అవుతుందనే చెప్పొచ్చు. మొత్తానికి నిధి అగర్వాల్ సినిమా కెరీర్ బిజీబిజీగా ఉంటోంది. వరుస అవకాశాలు వస్తుండటంతో ఆమె సినీ జీవితం జెట్ స్పీడులో దూసుకెళ్తోంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM