కళ్యాణ్ రామ్ పై నెటిజన్ల జోకులు !

by సూర్య | Fri, Jan 17, 2020, 06:09 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల సానుకూలంగానే స్పందించారు.  క్లీన్ ఫ్యామిలీ  ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ విడుదలైన సందర్భంగా కళ్యాణ్ రామ్ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన  మాటలను పట్టుకొని కొంత మంది నెటిజన్స్ కళ్యాణ్‌ రామ్‌ను అబద్దాల కోరు అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ మ్యాటరేమిటంటే.. కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మొదటిసారి తన సినిమా సంక్రాంతి పండక్కి విడుదల అవుతుంది అంటూ వ్యాఖ్యానించడాన్ని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. గతేడాది నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  సినిమా సంక్రాంతికి విడుదలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందులో కళ్యాణ్ రామ్.. తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మెయిన్ హీరో కాకపోయినా.. అప్పట్లో తాను యాక్ట్ చేసిన సినిమా మొదటిసారి సంక్రాంతికి విడుదలవుతుందంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రస్తావించాడు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు  బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కళ్యాణ్  రామ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నాడు అని నెటిజన్స్ సరదాగా గుర్తు చేస్తున్నారు. ఏమైనా కళ్యాణ్ రామ్ చెప్పినట్టు ఆయన సోలో హీరోగా సంక్రాంతికి రిలీజైన మొదటి సినిమా ‘ఎంత మంచివాడవురా’ అనడంలో ఎలాంటి తప్పులేదంటున్నారు ఇంకొంత మంది.

Latest News
 
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Thu, May 02, 2024, 02:57 PM
ఓపెన్ అయ్యిన 'బాక్' బుకింగ్స్ Thu, May 02, 2024, 02:50 PM
రేపు థియేటర్స్ సందడి చేయనున్న 'ప్రసన్నవదనం' Thu, May 02, 2024, 02:46 PM
'పతంగ్‌' టీజర్ లాంచ్ ఈవెంట్ కి టైమ్ లాక్ Thu, May 02, 2024, 02:43 PM
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM