బామ్మగా కాజల్ అగర్వాల్?

by సూర్య | Fri, Jan 17, 2020, 05:51 PM

కెరీర్ ప్రారంభించిన పదేళ్లు దాటుతున్నా కాజల్ అగర్వాల్ ఇప్పటికీ కుర్ర హీరోయిన్లుకు ధీటుగా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం మూవీతో పరిచయం అయిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే తన అందాలతో మంత్ర ముగ్దులను చేసింది. ప్రస్తుతం తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెక్కిస్తున్న ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ సరసన నటిస్తుంది. శంకర్ డైరక్షన్ లో భారతీయుడు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో తన పాత్ర గురించిన సీక్రెట్స్ బయటకు చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో కాజల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. హిందీ, తమిళ భాషల్లో ఒక్కో మూవీ చేస్తున్న ఈ బ్యూటీ ఇండియన్‌-2 పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కమలహాసన్‌తో తొలిసారిగా జత కట్టడం. స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించడం... పెద్ద బ్యానర్ లో నటించడం.. అన్నీ కలిసి వచ్చే అంశాలే... ఈ మూవీ సక్సెస్ అయితే కొంత కాలంగా హీరోయిన్ గా ఏలేయొచ్చు అనే ఆశలో కాజల్ ఉంది. ఇండియన్‌-2 మూవీలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని తెలిసిందన్నారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM